ఐఏఎస్ అధికారి రాధా ఫ్యామిలీ ఓట్లు గల్లంతు | IAS officer P.Radha family members names missing from voters' list | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారి రాధా ఫ్యామిలీ ఓట్లు గల్లంతు

Apr 30 2014 9:54 AM | Updated on Sep 27 2018 3:20 PM

హైదరాబాద్లో ఓటర్ల జాబితా అస్తవ్యస్థంగా మారింది. ఐఏఎస్ అధికారి పి.రాధా కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి.

హైదరాబాద్ : హైదరాబాద్లో ఓటర్ల జాబితా అస్తవ్యస్థంగా మారింది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకూ వెళ్లి అక్కడ ఓటర్ల జాబితాలో పేరు లేకపోవటంతో పలువురు ఓటర్లు నిరాశగా వెనుదిరుగుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు, ఉన్నత అధికారుల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఐఏఎస్ అధికారి పి.రాధా కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. గత ఎన్నికల్లో ఓటు వేసినా ప్రస్తుతం వారి పేర్లు ఓటర్ల జాబితాలో మాయామయ్యాయి. దాంతో ఐఏఎస్ అధికారి పి.రాధా ఓట్ల గల్లంతుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఓటర్ కార్డు ఉన్నా... ఓటర్లు స్లిప్లు లేవంటూ ఓటు వేసేందుకు అభ్యంతరం చెప్పటంపై ఓటర్లు మండిపడుతున్నారు. ఓటర్ కార్డులను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవటం లేదన్నారు. అలాంటప్పుడు కార్డులు ఎందుకు ఇచ్చారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement