కాంగ్రెస్ ప్రభంజనంతో కేసీఆర్ బెంబేలు | he Congress and face kcr | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ప్రభంజనంతో కేసీఆర్ బెంబేలు

Apr 20 2014 2:29 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ ప్రభంజనంతో కేసీఆర్ బెంబేలు - Sakshi

కాంగ్రెస్ ప్రభంజనంతో కేసీఆర్ బెంబేలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బెంబేలెత్తిపోతున్నారని, అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

అందుకే సుడిగాలి పర్యటనలు: పొన్నం
 
ఎల్కతుర్తి,  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బెంబేలెత్తిపోతున్నారని, అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సోనియాను ప్రజలు దేవతలా ఆరాధిస్తుంటే జీర్ణించుకోలేక.. సీఎం కుర్చీ కోసం కుటుంబాన్ని వెంటేసుకుని కాంగ్రెస్ పార్టీపై బురదచల్లుతున్నాడని విమర్శించారు. ఎవరు సన్యాసులో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని పేర్కొన్నారు. మాజీ సీఎం కిరణ్ చెప్పును గుర్తుగా పెట్టుకున్నాడని, ఎన్నికల తర్వాత ఆయన తన చెప్పుతో తానే కొట్టుకునే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement