ఎన్నికలను బహిష్కరించండి | elections should be boycott, call maoists | Sakshi
Sakshi News home page

ఎన్నికలను బహిష్కరించండి

Mar 31 2014 1:22 AM | Updated on Oct 9 2018 2:51 PM

బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, ఓట్ల పార్టీలను తరిమికొట్టాలని కోరుతూ ఖమ్మం జిల్లా చర్ల మండలం పెదమిడిసిలేరు మార్గంలో మావోయిస్టులు శనివారం అర్ధరాత్రి పోస్టర్లు వేసి బ్యానర్లు కట్టారు.

పార్టీలను తరిమికొట్టండి: మావోయిస్టుల పిలుపు


 చర్ల, న్యూస్‌లైన్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, ఓట్ల పార్టీలను తరిమికొట్టాలని కోరుతూ ఖమ్మం జిల్లా చర్ల మండలం పెదమిడిసిలేరు మార్గంలో మావోయిస్టులు శనివారం అర్ధరాత్రి పోస్టర్లు వేసి బ్యానర్లు కట్టారు. కలివేరు నుంచి పెదమిడిసిలేరుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట వెలసిన ఈ బ్యానర్లు, పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్ వంటి ఓట్ల పార్టీలను తరిమికొట్టాలని, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ను వ్యతిరేకించాలని, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement