వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి 1984 నుంచి క్రీయాశీలక రాజకీయాల్లో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన్ను వైఎస్సార్‌సీపీ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది.