దేశాన్ని పరిపాలించే సత్తా కాంగ్రెస్‌కే | election campaigns at Salem visit GK Vasan | Sakshi
Sakshi News home page

దేశాన్ని పరిపాలించే సత్తా కాంగ్రెస్‌కే

Apr 4 2014 11:40 PM | Updated on Mar 18 2019 9:02 PM

భారత దేశాన్ని పరిపాలించే సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్ పేర్కొన్నారు.

సేలం, న్యూస్‌లైన్ : భారత దేశాన్ని పరిపాలించే సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం సేలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల  చేయలేదని తెలిపారు.

 

ఆ పార్టీ శ్రేణుల్లో సఖ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సఖ్యత లేని పార్టీ దేశాన్ని ఎలా పరిపాలించగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు వల్ల కార్యకర్తలు, ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. శ్రీలంక తమిళల హక్కుల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉందని జీకే వాసన్ పేర్కొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement