కమలాపురంలో కాంగ్రెస్కు షాక్ | congress senior leader rajoli veerareddy joins ysr congress party | Sakshi
Sakshi News home page

కమలాపురంలో కాంగ్రెస్కు షాక్

Apr 5 2014 12:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఆ పార్టీకి షాక్ తగిలింది.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో  వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కమలాపురం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని కుమారులుతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement