'సీఎం రేసులో ఉన్న నేతలంతా ఓటమి' | cm race condidates loose in telangana | Sakshi
Sakshi News home page

'సీఎం రేసులో ఉన్న నేతలంతా ఓటమి'

May 16 2014 5:12 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ కకావికలమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పలువురు ముఖ్యనేతలు ఓటమి చవిచూశారు.

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ కకావికలమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పలువురు ముఖ్యనేతలు ఓటమి చవిచూశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామలో పరాజయం చెందారు. నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీచేసిన పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఓడిపోయారు.

అందోల్‌ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనరసింహ, కామారెడ్డి నుంచి షబ్బీర్‌ అలీ, మంథని నుంచి శ్రీధర్‌ బాబు, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, సునీతా  లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, వీ హనుమంతరావు ఓటమి పాలయ్యారు. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు విజయశాంతి, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, జయసుధ ఓడిపోయారు. కాగా గుడ్డిలో మెల్లగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి డీకే అరుణ గెలుపొందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement