వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల లోక్సభ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది.
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. అయితే వైఎస్ఆర్ సీపీ బాపట్ల లోక్సభ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది. అలాగే పి.గన్నవరం, ఆచంట, పాలకొల్లు, సంతనూతలపాడు, మార్కాపురం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాగా 24 లోక్సభ, 170 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే.


