వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుతున్నారు. సినీహీరోల అభిమానులు కూడా వైఎస్ జగన్మోహన రెడ్డి నాయకత్వంపట్ల ఆకర్షితులవుతున్నారు.
యువహీరో అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నేత చొక్కాకుల వెంకట్రావు సమక్షంలో వారు పార్టీలో చేరారు. సిటీ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడితోపాటు 200 మంది పార్టీలో చేరారు.


