బన్నీ- లోకేశ్‌ మూవీ ఆగిపోయిందా.. అసలు నిజమిదే..! | Allu Arjun and Lokesh Kanagaraj movie shelved this is the fact | Sakshi
Sakshi News home page

Allu Arjun: బన్నీ- లోకేశ్‌ మూవీ ఆగిపోయిందా.. అసలు నిజమిదే..!

Oct 11 2026 7:32 AM | Updated on Oct 11 2026 7:32 AM

Allu Arjun and Lokesh Kanagaraj movie shelved this is the fact

ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం రాకాతో బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అల్లు అర్జున్‌ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ సంగతి అటుంచితే బన్నీ తరువాత ప్రాజెక్ట్ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ మూవీ ఆగిపోలేదని.. కేవలం లోకేశ్ ఫైనల్ నేరేషన్ బన్నీ తిరస్కరించాడని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్‌లో చెప్పిన కథకు.. ఫైనల్‌ నేరేషన్‌లో తేడా రావడంతోనే అల్లు అర్జున్‌ రీ రైట్‌ చేయమని చెప్పాడని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ మార్చేందుకు లోకేశ్‌ 3 నెలల సమయం కూడా ఇచ్చాడని సమాచారం. ఈ పని త్వరగా పూర్తి చేస్తే లోకేశ్‌- బన్నీ కాంబోలో వస్తోన్న మూవీ పట్టాలెక్కనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement