ఓటర్ల చైతన్యం పెరిగింది. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014 నాటికి ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం.
ఓటర్ల చైతన్యం పెరిగింది. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014 నాటికి ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం. గడిచిన పోలింగ్ సమయానికి జిల్లాలో 23,42,812 ఓటర్లు నమోదు కాగా 2014 ఎన్నికల తుది జాబితా ప్రకారం ఆ సంఖ్య 24,84,109 గా నమోదైంది. కేవలం ఐదేళ్లలోనే ఏకంగా 1,41,297 మంది ఓటర్లు పెరిగారంటే ప్రజలు ఓటు విలువ ఎంతలా తెలుసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గత సార్వత్రిక ఎన్నికలు పరిశీలిస్తే జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన పోటీదారులుగా నిలువగా పీఆర్పీ కూడా గణనీయమైన ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది.
కానీ నేటి సార్వత్రిక ఎన్నికల సమయానికి రాజయకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. పీఆర్పీ తుస్సుమంటూ కాంగ్రెస్‌లో విలీనం కావడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లాలో కనుమరుగవడం చకచకా జరిగిపోయింది. ప్రజల మనసు గెలుచుకున్న పార్టీగా అవతరించిన వైఎస్సార్ సీపీ మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోనుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. టీడీపీ చారిత్రక తప్పిదం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో చాలామంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో 2009లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదయ్యాయో సాక్షి పాఠకులకు అందిస్తున్నాం.