ఫ్యామిలీ కౌన్సెలింగ్లో ఎనిమిది జంటలు రాజీ | 8 couples compromise at family counselling | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ కౌన్సెలింగ్లో ఎనిమిది జంటలు రాజీ

Sep 4 2016 11:33 PM | Updated on Sep 4 2017 12:18 PM

కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించిన భార్యాభర్తలకు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

కర్నూలు: కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించిన భార్యాభర్తలకు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 13 జంటలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యాయి.   డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ సభ్యులు రాజేశ్వరి, హిందుమతి, నాగశేషయ్య, లెనిన్‌బాబు, పాపయ్యగుప్త తదితరులు  వారి వాదనలు విన్నారు. విడిపోవడంతో జరిగే అనర్థాలను వివరించారు. సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగుతుందని నచ్చజెప్పారు. దీంతో 8జంటలు కలిసి కాపురం చేసేందుకు అంగీకరించాయి. మరో ఐదు జంటలు విడిపోవడానికి మొగ్గు చూపడంతో వచ్చే వారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించి పంపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement