ప్రొఫెసర్‌ బాబులుపై సస్పెన్షన్‌ వేటు | kakinada JNTU professor suspended after sexual harassment allegations | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ బాబులుపై సస్పెన్షన్‌ వేటు

Jan 30 2018 8:18 PM | Updated on Jul 23 2018 8:49 PM

kakinada JNTU professor suspended after sexual harassment allegations  - Sakshi

సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జేఎన్‌టీయూ-కే ఎంటెక్‌ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ బాబులుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు జేఎన్‌టీయూ-కే వీసీ వీఎస్‌ఎస్‌.కుమార్‌ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం చెలరేగి విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, మహిళా కమిషన్‌ జోక్యం చేసుకోవడం, విచారణ కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రొఫెసర్‌ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్‌ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 254, 254ఎ, 509 సెక‌్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ చెప్పారు. త్వరలోనే ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement