నిద్రాణంగా ‘పరిషత్‌’ వ్యవస్థ! | Zilla Parishad systems plight in hyderabad | Sakshi
Sakshi News home page

నిద్రాణంగా ‘పరిషత్‌’ వ్యవస్థ!

Dec 26 2016 2:37 AM | Updated on Sep 4 2017 11:35 PM

నిధుల్లేవ్‌.. విధుల్లేవ్‌.. అధికారాలూ లేవ్‌.. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ వ్యవస్థల దుస్థితి ఇదీ. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: నిధుల్లేవ్‌.. విధుల్లేవ్‌.. అధికారాలూ లేవ్‌.. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ వ్యవస్థల దుస్థితి ఇదీ. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ప్రజలతో నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వీస మెత్తు విలువ లేదు. ప్రభుత్వం చేపడుతున్న గ్రామజ్యోతి, ఉపాధిహామీ, ఇందిరాక్రాంతి పథకం కార్యక్రమాల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయలేక పోవడం వల్ల,  ప్రజల్లో వారిపట్ల ఒక విధమైన చులకనభావం ఏర్పడుతోంది. స్థానిక సంస్థ లకు 29 ప్రభుత్వ విభాగాలపై ఆజమాయిషీ కల్పించాలని, ఈ మేరకు అధికారాలను బదలాయించాలని రాజ్యాంగం చెబుతున్నా, గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 14వ ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందు తుండటంతో మండల, జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల్లేకుండా పోయాయి.

తెలం గాణలో ఎస్‌ఎఫ్‌సీని గతేడాది ఏర్పాటు చేసినా  నేటివరకు దానికి చైర్మన్‌నుగానీ, సభ్యులను గానీ ప్రభుత్వం నియమించలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సర్పం చులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలే వారికిష్టమైన రీతిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క పైసా కూడా ప్రభు త్వాలు కేటాయించకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌లు నిద్రాణంగా మారాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. రాష్ట్రంలోని 5,850 మంది ఎంపీటీసీలు, 456 మంది ఎంపీటీసీలకు వేతన బకాయిల నిమిత్తం రూ.18.12 కోట్లు విడుదల చేస్తూ గత అక్టో బర్‌లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు అమలుకు నోచుకో లేదు. మరోవైపు మండల పరిషత్‌లకు నిధు ల్లేక ఆయా మండలాల్లో అభివృద్ధి పనులేమీ జరగకపోయినా సిబ్బందికి వేత నాల ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది.

ఆందోళన బాట పడతాం
పరిషత్‌ వ్యవస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయింది. గ్రామ జ్యోతిలో భాగస్వాములను చేస్తామని కరీంనగర్‌సభలో సీఎం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయింది. గతంలో ఇందిరాక్రాంతి, ఉపాధిహామీ పథకం సిబ్బంది ఎంపీటీసీల ఆధ్వర్యంలోనే పని చేసేవారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో పాలన ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల చేతుల్లోకి పోయింది. పరిషత్‌ వ్యవస్థలపై ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా త్వరలోనే ఆందోళనబాట పట్టాలని నిర్ణయించాం.
– యు. మనోహర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement