నిర్మలా సీతారామన్ని కలసిన వైవీ సుబ్బారెడ్డి | YV Subba reddy met with nirmala sitharaman | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్ని కలసిన వైవీ సుబ్బారెడ్డి

Sep 18 2015 10:06 AM | Updated on Sep 3 2017 9:35 AM

పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఒంగోలు లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఒంగోలు : పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఒంగోలు లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మలా సీతారామన్ పర్యటించారు. అందులోభాగంగా ఆమె పేర్నమిట్ట పొగాకు వేలం కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా ఆమెకు వైవీ సుబ్బారెడ్డి వినతి పత్రం అందజేశారు.

పొగాకు రైతులు బాగా నష్టపోయారని ఈ నేపథ్యంలో వారికి భారీ స్థాయిలో నష్ట పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ఆయన...కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ని కోరారు. వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి పట్ల ఆమె సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement