నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది.
విశాఖపట్నం: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. ఇంటిపన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్.. వైఎస్ఆర్ సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు.