దేవినేని ఉమకు పిచ్చికుక్క కరిచిందట.. | ysrcp leader jogi ramesh takes on minister devineni uma | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమకు పిచ్చికుక్క కరిచిందట..

Jun 26 2016 2:15 PM | Updated on May 29 2018 4:26 PM

దేవినేని ఉమకు పిచ్చికుక్క కరిచిందట.. - Sakshi

దేవినేని ఉమకు పిచ్చికుక్క కరిచిందట..

దేవినేని ఉమ అసమర్థ, అజ్ఞాన, నీచమైన మంత్రి అని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ నీటిపారుదల శాఖ మంత్రిగా చూడలేదని అన్నారు.

విజయవాడ: దేవినేని ఉమ అసమర్థ, అజ్ఞాన, నీచమైన మంత్రి అని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ నీటిపారుదల శాఖ మంత్రిగా చూడలేదని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. దేవినేని అసమర్థత వల్లే పులిచింత ప్రాజెక్టు ఆగిందని చెప్పారు.

దేవినేని ఉమకు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచిందట, అందుకే అమావాస్య, పౌర్ణమినాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడని అన్నారు. డబ్బులు దండుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు కట్టరని, ఇందులో 500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల చుక్కనీరు కూడా కృష్ణా డెల్టాకు రాలేదని చెప్పారు. జూన్లో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తామన్న విషయం ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ దోపిడీ, దుర్మార‍్గాలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. ప్రాజెక్టులతో పాటు కృష్ణా పుష్కర పనుల్లోనూ దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడీయే కారణం అన్నారు. అందులో మీ వాటా ఎంతో దుర్గమ్మ సాక్షిగా చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందని అన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైఎస్ జగన్ మాట్లాడితే వాళ్లు మాత్రం భయంతో పారిపోయి వచ్చారని చెప్పారు. దేవుడు కరుణిస్తే తప్ప సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ఉమ అని అన్నారు. దమ్ముంటే తనతో కలిసి కృష్ణా డెల్టాకు రావాలని, అలా వస్తే రైతులు కొట్టడం ఖాయం అని చెప్పారు. కృష్ణా డెల్టాను ఏడారిగా మార్చిన దద్దమ్మ ఉమనే అని జోగి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement