తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...? | ysrcp fores on tdp over thotapally project | Sakshi
Sakshi News home page

తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...?

Jul 18 2016 12:21 PM | Updated on May 29 2018 4:26 PM

తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...? - Sakshi

తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...?

జిల్లాలో నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నయని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జి.శ్రీనివాసరావు అన్నారు.

విజయనగరం మున్సిపాలిటీ:
జిల్లాలో నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు  చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నయని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జి.శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని రూ.కోట్ల నిధులు కేటాయించారో..? ఎంత మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయో ...?  ప్రజలకు తెలియజెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఈ చర్చలో పార్టీ జిల్లా పెద్దలతో తాము వస్తామని, అధికారులను వెంటబెట్టుకుని  అధికార పార్టీ నాయకులు రావాలని సూచించారు.  ఆదివారం స్థానిక సత్యకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, నిధుల వ్యయం, నీటి సరఫరా వంటి వివరాలతో అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు.
 
నిధుల కేటాయింపులు పరిశీలిద్దాం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, ఉన్న కొద్దిపాటి 10 శాతం పనులు పూర్తి చేయకుండానే ప్రారంభించిన టీడీపీ నాయకులు ఆ ఘనత తమదే అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.   అలా అయితే 2004 నుంచి 2014 సంవత్సరంల వరకు  ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు,  2014 అనంతరం కేటాయించిన నిధుల లెక్కల వివరాలు పరిశీలిస్తే ఎవరి హయంలో పనులు జరిగాయో తేలిపోతుందన్నారు. పార్టీ నాయకుడు పిళ్లా విజయ్‌కుమార్ మాట్లాడుతూ విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అవినీతి, అక్రమార్జన, ప్రభుత్వ ఆస్తుల అడ్డుగోలు కేటాయింపులపై  తూర్పారబట్టారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తెట్టంగి పీఏసీఎస్ అధ్యక్షుడు కె.రవిబాబు, పార్టీ వాణిజ్య విభా గం నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మథకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement