దూబగుంట రోశమ్మ మృతిపట్ల జగన్ సంతాపం | YS Jagan's Condolences For Dubagunta rosamma Demise | Sakshi
Sakshi News home page

దూబగుంట రోశమ్మ మృతిపట్ల జగన్ సంతాపం

Aug 7 2016 3:45 PM | Updated on Sep 4 2018 5:21 PM

బగుంట రోశమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

దూబగుంట రోశమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వేళ మహిళాలోకం నడుం బిగిస్తే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని రోశమ్మ పోరాటం నిరూపించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ 1990 ప్రాంతంలో ప్రారంభించిన మహోద్యమం తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన అధ్యాయం అని జగన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే మహోద్యమాలను గ్రామాల నుంచి నిర్మించవచ్చని రోశయ్య నిరూపించారని ఆయన అన్నారు. రోశమ్మకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement