అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర | ys jaganmohanreddy, rythu barosa yatra | Sakshi
Sakshi News home page

అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర

Jan 12 2016 9:47 AM | Updated on Jun 1 2018 8:36 PM

అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర - Sakshi

అనంతలో ఏడో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర

వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నేడు ఏడో రోజు కొనసాగుతుంది.

అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు ప్రారంభమైంది. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు కలిశారు. జన్మభూమి కమిటీలు రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు ఆయనకు విన్నవించారు. రైతు భరోసాయాత్రలో భాగంగా తొలుత రాప్తాడు నియోజకవర్గంలో సీకేపల్లి మండలం వెంకటాంపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.

అనంతరం బసంపల్లిలో రైతు సోమశేఖర్ కుటుంబాన్ని కలుసుకుని వారిని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. రెండు కుటుంబాలను పరామర్శించడంతో అనంతపురంలో వైఎస్ జగన్ చేపట్టిన నాలుగో విడత రైతు భరోసాయాత్ర ముగియనుంది.

Advertisement
 
Advertisement
Advertisement