నాగరాజు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan rythu bharosa yatra in anantapur kistipadu | Sakshi
Sakshi News home page

నాగరాజు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Jun 2 2016 4:07 PM | Updated on Jul 25 2018 4:09 PM

కిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. గురువారం ఆయన కిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తర్వాత రాయల చెరువు మీదగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్  పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదగా కిష్టపాడు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement