breaking news
Nagaraju family
-
నాగరాజు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. గురువారం ఆయన కిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత రాయల చెరువు మీదగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదగా కిష్టపాడు చేరుకున్నారు. -
నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలి
‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వద్ద ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: కేన్సర్‌తో తనువుచాలించిన జర్నలిస్టు కొప్పుల నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు, బిర్సా అంబేద్కర్ ఫూలే విద్యార్థి సంఘం (బిఎపీఎస్ఏ) ఆధ్వర్యంలో శనివారమిక్కడి న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. యూనియన్, విద్యార్ధి సంఘ నేతలు, సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ జీవితంలో, వృత్తిపరంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న నాగరాజు ప్రస్థానాన్ని వివరించారు. ఆంగ్ల ప్రింట్ మీడియాలో మాదిగ వర్గానికి చెందిన ఏకైక జర్నలిస్టుగా నాగరాజు నిలిచిపోయారన్నారు. తనకు తానుగా మృతిచెందలేదని, వైద్యసదుపాయం కల్పించడంలో యాజమాన్యం వివక్ష చూపడం వల్ల నాగరాజు అనంతలోకాలకు వెళ్లిపోయాడన్నారు. పత్రిక స్వేచ్ఛను యజమాన్యాలు, ప్రభుత్వాలు హరించివేస్తున్నాయన్నారు. అనంతరం ఆందోళనకారులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నాగరాజుకు శ్రద్ధాంజలి అర్పించారు.