నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలి | will protest for justify of Nagaraju family | Sakshi
Sakshi News home page

నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలి

Apr 26 2015 4:10 AM | Updated on Sep 3 2017 12:52 AM

కేన్సర్‌తో తనువుచాలించిన జర్నలిస్టు కొప్పుల నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు..

‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వద్ద ధర్నా
 సాక్షి, న్యూఢిల్లీ: కేన్సర్‌తో తనువుచాలించిన జర్నలిస్టు కొప్పుల నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు, బిర్సా అంబేద్కర్ ఫూలే విద్యార్థి సంఘం (బిఎపీఎస్‌ఏ) ఆధ్వర్యంలో శనివారమిక్కడి న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.  యూనియన్, విద్యార్ధి సంఘ నేతలు, సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ జీవితంలో, వృత్తిపరంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న నాగరాజు ప్రస్థానాన్ని వివరించారు.

ఆంగ్ల ప్రింట్ మీడియాలో మాదిగ వర్గానికి చెందిన ఏకైక జర్నలిస్టుగా నాగరాజు నిలిచిపోయారన్నారు. తనకు తానుగా మృతిచెందలేదని, వైద్యసదుపాయం కల్పించడంలో యాజమాన్యం వివక్ష చూపడం వల్ల నాగరాజు అనంతలోకాలకు వెళ్లిపోయాడన్నారు. పత్రిక స్వేచ్ఛను యజమాన్యాలు, ప్రభుత్వాలు హరించివేస్తున్నాయన్నారు. అనంతరం ఆందోళనకారులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నాగరాజుకు శ్రద్ధాంజలి అర్పించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement