ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan mohan reddy congratulations to ISRO scientists | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

May 23 2016 10:50 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

ఆర్‌ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అభినందనలు తెలిపారు.

హైదరాబాద్: ఆర్‌ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో  శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే ప్రయోగాలను ఇదే స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్(ఆర్‌ఎల్‌వీ-టీడీ)ని అంతరిక్ష వాహన నౌక ప్రయోగానికి ఇస్రో పదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. తిరువనంతపురం సమీపంలోని విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో ప్రయోగాలు చేపట్టింది. సుమారు 600మంది శాస్త్రవేత్తలు పదేళ్లుగా శ్రమించారు. మరోవైపు ఆర్ఎల్వీ-టీడీ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement