పులివెందులలో వైఎస్ జగన్ బిజిబిజీ... | YS Jagan busy tour in pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్ జగన్ బిజిబిజీ...

Nov 4 2015 3:28 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.

వైఎస్సార్ జిల్లా:  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు.
 
పులివెందుల మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధతాళలేక గతనెల 19 వ తేదీన పొలం వద్దనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోవైపు, ఇటీవల వార్డు కౌన్సిలర్ అరుణకుమారి కుమారుడి వివాహం జరిగింది. అరుణకుమారి ఇంటికి వెళ్లి ఆయన నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement