దాడిలో యువకుడు మృతి | younger dies of attacks | Sakshi
Sakshi News home page

దాడిలో యువకుడు మృతి

Sep 15 2016 12:10 AM | Updated on Aug 1 2018 2:10 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు.

ధర్మవరం రూరల్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. బంధువులు, పోలీసుల సమాచారం మేరకు.. ఉరవకొండ మండలం వెంకటంపల్లి తండాకు చెందిన లక్ష్మిబాయ్‌కి ధర్మవరం మండలం నిమ్మలకుంటకుS చెందిన రమేష్‌నాయక్‌తో వివాహమైంది. అయితే కుటుంబ కలహాలతో కొద్ది రోజుల క్రితం దంపతులు విడిపోయారు. ఈ నేపధ్యంలో మంజులాబాయ్‌ చిన్నాన్న తపాల్‌నాయక్‌ దంపతులను కలపాలనే ఉద్దేశ్యంతో బుధవారం నిమ్మలకుంటకు వచ్చి రమేష్‌నాయక్‌తో మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవకు దారికి తీసింది.

ఈ క్రమంలో రమేష్‌నాయక్‌ సోదరుడు మోతిలాల్‌నాయక్‌(24)పై తపాల్‌ నాయక్‌ పక్కనే ఉన్న ఇస్త్రీపెట్టెతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన మోతిలాల్‌నాయక్‌ను వెంటనే ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం అటు నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement