ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య | young person died with hanging | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

Oct 5 2016 10:04 PM | Updated on Aug 1 2018 2:36 PM

చౌటుప్పల్‌: మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన యువకుడు గట్టు యుగేంధర్‌(21) మంగళవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చౌటుప్పల్‌: మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన యువకుడు గట్టు యుగేంధర్‌(21) మంగళవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని తండ్రి గతంలోనే చనిపోయాడు. మంగళవారం తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement