పెళ్లి కళ కల్లలైన వేళ.. | young man wedding dreams collapsed | Sakshi
Sakshi News home page

పెళ్లి కళ కల్లలైన వేళ..

May 15 2016 3:11 PM | Updated on Aug 24 2018 2:36 PM

పెళ్లి కళ కల్లలైన వేళ.. - Sakshi

పెళ్లి కళ కల్లలైన వేళ..

మరో నెల రోజుల్లో కల్యాణ వీణ మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రత్తిపాడు: మరో నెల రోజుల్లో కల్యాణ వీణ మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరులో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిన ఘటనలో వరుడు కావాల్సిన యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ఇక్కుర్తి జాన్, రాయేలు దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్నవాడైన బూసి సలోమన్ (21)కు నరసరావుపేటకు సమీపంలోని ఇక్కుర్తి రాయపాడుకు చెందిన యువతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది.

జూన్ 9వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గుంటూరులో రాడ్ బెండింగ్ పనికి వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలిన ఘటనలో అతను మృతి చెందాడు. పెళ్లి ఖర్చులకు డబ్బు సంపాదిస్తామని వెళ్లి అటే వెళ్లిపోయాడంటూ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement