మాజీ మంత్రి అంబటిపై మరో అక్రమ కేసు | Another Illegal Case Against Former Minister Ambati Rambabu | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి అంబటిపై మరో అక్రమ కేసు

Oct 15 2026 4:58 PM | Updated on Oct 15 2026 5:11 PM

Another Illegal Case Against Former Minister Ambati Rambabu

సాక్షి, గుంటూరు: స్థానిక ఎన్నికల వేళ కూటమి కక్ష సాధింపులకు దిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో అక్రమ కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన టీడీపీ గూండాల అరెస్ట్‌ కోరుతూ ఏప్రిల్‌లో కలెక్టరేట్‌ ఎదుట అంబటి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష చేసిన అంబటికి పట్టాభిపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్‌ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 18 తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్‌ వద్ద 12 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. కాగా, గతంలో చంద్రబాబు సర్కార్‌.. అంబటి రాంబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి అన్యాయంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?
 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement