యువకుడి దారుణహత్య | young man murder in mandamarri | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Aug 2 2016 12:04 AM | Updated on Aug 1 2018 2:29 PM

మందమర్రి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ చౌరస్తాలో సోమవారం రాత్రి మేకల రాజేశ్‌(23) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం...

మందమర్రి : మందమర్రి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ చౌరస్తాలో సోమవారం రాత్రి మేకల రాజేశ్‌(23) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రాజేశ్‌తో తన స్నేహితులైన ఐదుగురు యువకులకు బస్టాండ్‌ ప్రాంతంలో ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో వినయ్‌ అనే యువకుడు కత్తితో రాజేశ్‌పై దాడి చేశాడు. కడుపులో పొడిచాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సతీశ్‌ పోలీసు బందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్‌ను చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. హత్య కారణాలు తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement