-
వ్యవసాయ శాస్త్రవేత్తలుగా రాణిస్తున్న మహిళలు
-
పంటల దిగుబడిలో రైతులకు మేలైన సూచనలు
-
క్షేత్రస్థాయి సందర్శనలతో అవగాహన
-
జిల్లాలో వ్యవసాయరంగం అభివృద్ధికి కృషి
మహబూబాబాద్‌రూరల్/ పోచమ్మమైదాన్ : వారికి వ్యవసాయ రంగం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి పంటల సాగుపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో చదివారు. అన్నదాతలకు మెరుగైన సేవలందిం చాలనే ఆలోచనలతో సాగుబడిలో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలు వులు సంపాదించారు. ఈ మేరకు పంట చేలను సందర్శిస్తూ నిత్యం రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. కర్షకులు బాగుంటేనే దేశం ప్రగతిబాటలో పయనిస్తుందని చెబుతున్న పలువురు మహిళా వ్యవసాయ శాస్త్రవేత్తలపై ప్రత్యేక కథనం.
ఫలితాల ‘మాలతి’
పంటలను ఆశి స్తున్న చీడ పురుగులను నివారిం చేందుకు రైతుల కు నిత్యం సల హాలు అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శీతాలం మాలతి. వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విభాగంలో పనిచేస్తున్న ఆమె క్షేత్రస్థాయిలో
పంటలను సందర్శిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. బీఎస్సీ (అగ్రికల్చర్),
ఎమ్మెస్సీ పూర్తి చేసిన మాలతి పీహెచ్‌డీ ఎంటమాలజీలో పరిశోధన చేశారు. తర్వాత సివిల్స్ రాసి రెండు సార్లు ఇంటర్వూ్య వరకు వెళ్లి వెనుదిరిగారు. ఈ క్రమంలో 2001లో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. పంటల సాగులో పురుగులను ఎలా తగ్గించాలి.. చీడపీడలను తట్టుకునే రకాలు, సమగ్ర సస్యరక్షణ పై పరిశోధనలు చేసి మాలతి మంచి ఫలితాలు సాధించారు. 2011లో ఆమె వ్యవసాయ పరిశోధన విభాగంలో ఉత్తమ శాస్త్రవేత్తగా అవార్డు అందుకున్నారు. అలాగే ఆచార్య ఎన్‌జీ రంగ యూనివర్సిటీ 47వ స్నాతకోత్సవంలో, ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఉత్తమ శాస్త్రవేత్తగా అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీడ పురుగులపై అవగాహన కల్పిస్తూ రైతులున చైతన్యవంతులను చేస్తున్నానని చెప్పారు.
సాగు ‘సరళ’తరం
పంటల సాగులో రైతులకు నిత్యం సలహా లు అందిస్తూ వారి అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు మానుకోట మండలం మల్యాల కృషి విజ్ఞాన కేం ద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త ఏ. సరళకుమారి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సరళకుమారి మల్యాల కేవీకేలో 17 ఏళ్లు గా గృహవిజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. అలాగే కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా కూడా బాధ్యత లు నిర్వర్తిస్తూ మహిళా రైతులకు సేవలందిస్తున్నారు. రైతు కుటుం బానికి చెందిన సరళకుమారి 1999లో ఉద్యోగంలో చేరారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో హోంసైన్స్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం పొందిన తర్వాత విజయనగరం జిల్లా పార్వతీ పురంలోని రీసెర్చ్ స్టేషన్‌లో, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద ఉన్న హోంసైన్స్ కళాశాలలో విద్యార్థులకు వ్యవసాయంపై తరగతులు బోధించారు. గృహ విజ్ఞానంపై ఆసక్తి పెంచుకున్న సరళకుమారి అందులో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఈ మేరకు వ్యవసాయంలో దుక్కులు దున్నడం, పంట చేతికొచ్చే వరకు రైతులు చేపట్టాల్సిన పనులపై సూచనలు ఇస్తున్నారు. అలాగే పశుపోషణలో కూ డా ఏ విధంగా శ్రమించాలో తెలియజేస్తున్నారు. వ్యవసాయ పరికరాల వినియోగంలో, పంట ఉత్పత్తుల నైపుణ్యాల పెంపుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పోషక విలువలు కలి గిన చిరుధాన్యాల పెంపకం, విలువ ఆధారిత పదార్థాల తయారీ, కూరగాయాలు, వర్మికంపోస్టు తయారు చేసే పద్ధతులు, వాటి అమ్మకంపై రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో ‘కవిత’
వ్యవసాయ క్షేత్రాలను నిరంతరం సందర్శిస్తూ పంటల సాగుపై రైతులకు నిత్యం సలహాలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు మల్యాల కేవీకే విస్తరణ విభాగపు శాస్త్రవేత్త శిల్మర్తుల కవిత. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజ్ఞా హైస్కూల్‌లో కవిత 1 నుంచి 10 వరకు చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ పూర్తి చేశారు. ఈ క్రమంలో 2015 డిసెంబర్‌లో ఆమె విస్తరణ శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. ఈ మేరకు రోజు ఆమె వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నారు.
విత్తనాల తయారీలో ‘కాసాని’
రైతులకు కొత్త వరి వంగడాలను తయారు చేసి అందిస్తూ అధిక దిగుబyì కి కృషి చేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త కాసాని రుక్మిణిదేవి. వరం గల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆమె 2002లో వర్ధన్నపేట మండల వ్యవసాయాధికారిగా విధుల్లో చేరారు. 2006లో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన రుక్మిణిదేవి తర్వాత వరిలో కొత్త రకాల వం గడాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా సాంబమశూరికి ప్రత్యామ్నాయంగా సిద్ధి, సోమ్‌నాథ్ విత్తనాల తయారీలో కీలకపాత్ర పోషించారు. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి వస్తున్న సోమ్‌నాథ్ విత్తనాల వైపు రైతులు మెుగ్గుచూపుతున్నట్లు తెలిసింది. యా దాద్రి పెసరు విత్తనాలు, సన్‌ప్లవర్ ఎన్‌డీఎస్‌హెచ్‌ఐ, డీఆర్‌ఎస్ ఎఫ్ 106 రకం పొద్దుతిరుగుడు విత్తనాల రూపకకల్పనలో కూడా రుక్మిణిదేవి ప్రముఖంగా పనిచేశారు. ప్రస్తుతం స్వల్పకాలంలో పండించే పంటలు, హైబ్రిడ్ వరి విత్తనాలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు. ఈ సం దర్భంగా రుక్మిణిదేవి మాట్లాడుతూ మాది వ్యవసాయ కుటుంబం కాకున్నప్పటికీ పంటలసాగుపై ఆసక్తి పెంచుకుని కోర్సును చదివానన్నారు. రైతులకు హైబ్రిడ్ విత్తనాలు అందించి వారిని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
అన్నదాతలకు ‘చైతన్య’ దీపిక
పంటల సాగులో రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు గడించేందు కు కృషి చేస్తున్నారు డాక్టర్ తుక్కాని చైతన్య. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన చైతన్య హైదరాబాద్‌లోని గుంటూరు వికాస్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఆమె అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివి అందులోనే పీహెచ్‌డీ పూర్తి చేశారు. అయితే పీహెచ్‌డీలో సాయిల్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే 2014 ఫిబ్రవరిలో వ్యవసాయశాఖలో ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో చైతన్య ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మల్యాల కేవీకేలో క్రాప్ ప్రొడక్షన్ సైంటిస్ట్ (పంట ఉత్పత్తి శాస్త్రవేత్త)గా పని చేస్తున్నారు. కాగా, పంట ఉత్పత్తి శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్న చైతన్య భూసార విభాగంపై పట్టు సాధించి రైతులకు వ్యవసాయ భూములపై మేలైన సూచనలు ఇస్తున్నారు. పం టల సాగు సమయంలో పెట్టుబడులు తగ్గించి అధిక లాభాలు పొందే విధంగా ఆమె ప్రోత్సహిస్తున్నారు. పురుగుల మందుల వాడకంతో కాలుష్యం పెరి గి పంటలకు నష్టం జరుగుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘స్టడీస్ ఆన్ పొటాషియం డైనమిక్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ బ్రింజాల్, క్యాబేజ్ సిస్టం టు అప్లై పొటాషియం’ అంశంపై చైతన్య పీహెచ్‌డీ పూర్తి చేశారు. భూసార, నీటి పరీక్షల ద్వారా కేవీకేలోని అధునాతన పరికరాలతో రైతులకు సేవలందిస్తున్నారు.
రైతన్నల సేవలో ‘రాములమ్మ’
మానుకోట మండలం మల్యాల కేవీకేలో సస్యరక్షణ విభాగంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అన్నపూరి రాములమ్మ రైతులకు పారదర్శకంగా సేవలందిస్తోంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాuý శాలలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుకున్న రాములమ్మ కరీంనగర్ జిల్లా జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ కళాశాలలో 2014లో ఎమ్మెస్సీ ఎంటమాలజీ పూర్తిచేశారు. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరారు. మ ల్యాల కేవీకేలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాములమ్మ రైతులకు సమగ్ర సస్యరక్షణపై అవగాహన కల్పించటంతో పాటు రసాయన , పురు గు మందుల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్రతి రోజు పంట క్షేత్రాలను సందర్శిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.