వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 4 2017 12:50 AM | Updated on Sep 5 2017 7:51 AM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

రుణదాతల ఒత్తిళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

పెద్దపప్పూరు (తాడిపత్రి) : రుణదాతల ఒత్తిళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన రవీంద్ర చేనేత కార్మికుడు. మగ్గం గిట్టుబాటు కాకపోవడంతో అప్పులపాలయ్యాడు. కుటుంబ పోషణ సైతం భారమైంది. దీంతో అప్పులుఇ చ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి తెచ్చేవారు.

దీన్ని అవమానంగా భావించిన రవీంద్ర భార్య రుక్మిణి (40) సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పి.. తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ శ్రీహర్ష సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement