మహిళ బలవన్మరణం | woman suicide | Sakshi
Sakshi News home page

మహిళ బలవన్మరణం

Oct 13 2016 1:49 AM | Updated on Sep 18 2018 7:34 PM

జంగారెడ్డిగూడెం : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ విషపదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది.

జంగారెడ్డిగూడెం : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ విషపదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని వెంకటరామానుజపురానికి చెందిన మారెడ్డి సుభాషిణి (36) మంగళవారం విషపదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో భర్త పోతురాజు లేని సమయంలో విషపదార్థం తిని అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుభాషిణి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమెకు ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కూతురు, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement