కరీంనగర్లో మహిళ దారుణ హత్య | woman murdered in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో మహిళ దారుణ హత్య

Jan 13 2016 4:55 PM | Updated on Sep 3 2017 3:37 PM

కరీంనగర్లో మహిళ దారుణ హత్య

కరీంనగర్లో మహిళ దారుణ హత్య

కరీంనగర్ జిల్లాలో బుధవారం దారుణం జరిగింది.

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. హుజూరాబాద్ పట్టణంలో ఒక మహిళ హత్యకు గురైంది. స్థానిక పాత టెలిఫోన్ ఎక్స్చేంజి సమీపంలో నివాసం ఉండే అయిత సురేందర్, భాగ్యలక్ష్మీ(44) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సురేందర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు, ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లగా భాగ్యలక్ష్మీ ఒక్కరే ఇంట్లో ఉంది.


ఆ ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు ఉండే మహిళ ఆమె కోసమని మధ్యాహ్నం పై అంతస్తులోకి వెళ్లింది. హాలులో భాగ్యలక్ష్మీ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి, చుట్టుపక్కల వారికి విషయాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని ఆగంతకులు ఆమె మెడలోని గొలుసు తెంపుకు పోయే ప్రయత్నంలో... ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రమణమూర్తి పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement