సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేస్తామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలిపారు.
నల్లగొండ: సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేస్తామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలిపారు. నల్లగొండలో ఆయన శుక్రవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో నిందితుడుగా ఉన్న సురేష్ ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు డబ్బుల కోసం శ్రీలంకలో కిడ్నీలు అమ్ముకుంటున్న ఘటన ఇటీవలే వెలుగుచూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
కిడ్నీ రాకెట్ ఉదంతంలో శ్రీలంకలో నాలుగు ఆస్పత్రులు, ఆరుగురు డాక్టర్లకు కిడ్నీ అక్రమ ట్రాన్స్ ప్లాంటేషన్ల పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. మధ్యప్రదేశ్ లో మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ దుగ్గల్ సాక్షి మీడియాకు తెలిపారు. శ్రీలకం ప్రభుత్వం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లను నిలిపివేయడాన్ని అభినందించారు. ప్రభుత్వం అనుమతిస్తే శ్రీలంకలో కూడా విచారణ జరపడానికి సిద్ధమని ఎస్పీ వివరించారు.