ఇక నుంచి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో పటిష్టత తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కడియం శ్రీహరి అన్నారు.
హైదరాబాద్: ఇక నుంచి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో పటిష్టత తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్షా 40 వేలమంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ఉచిత విద్య ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.140 కోట్లు కేటాయించామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.