పీఏబీఆర్‌ కు జలసిరి | water level raise to pabr dam | Sakshi
Sakshi News home page

పీఏబీఆర్‌ కు జలసిరి

Sep 4 2016 11:20 PM | Updated on Jun 1 2018 8:39 PM

పీఏబీఆర్‌ కు జలసిరి - Sakshi

పీఏబీఆర్‌ కు జలసిరి

మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది.

– జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి 1000 క్యూసెక్కులు
– హెచ్చెల్సీ నుంచి 450 క్యూసెక్కెల నీరు డ్యాంకు సరఫరా


కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రోజుకు సుమారు 1000 క్యూసెక్కులకు పైగానే నీరు సరఫరా అవుతోంది. అలాగే తుంగభ్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కెనాల్‌ ద్వారా రోజుకు సుమారు 450 క్యూసెక్కుల వరకు సరఫరా అవుతోంది.

ఆదివారం డ్యాంలో 2.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ఏపీ జెన్‌కో జల విద్యుత్‌ తయారికి రోజుకు సుమారు 800 క్యూసెక్కుల వరకు నీటిని డ్యాం నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి అనంతం ఆ నీరు మిడ్‌పెన్నార్‌డ్యాంలోకి వదలడం జరుగుతుందని డీఈ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement