వర్ధన్నపేటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక వరంగల్–ఖమ్మం రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. వర్ధన్నపేట జిల్లా ప్రకటించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
వర్ధన్నపేట జిల్లా చేయాలి
Aug 26 2016 12:13 AM | Updated on Mar 18 2019 9:02 PM
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక వరంగల్–ఖమ్మం రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. వర్ధన్నపేట జిల్లా ప్రకటించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని భౌగోళికంగా, పరిపాలనపరంగా ఆలోచించి వర్ధన్నపేటను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహబూబాద్, భూపాలపల్లి జిల్లాలు సబబుగానే ఉన్నా.. ఎవరూ కోరని హన్మకొండను జిల్లాగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హన్మకొండను వరంగల్ నుంచి వేరు చేయడం సమంజసం కాదన్నారు. వర్ధన్నపేట జిల్లా కోసం జేఏసీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమా లు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐ ఆదినారాయణ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను అరెస్టు చేసి, తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ముత్తిరెడ్డి కేశవరెడ్డి, వడిచర్ల శ్రీనివాస్, రాయపురం సాంబయ్య, నరుకుడు వెంకటయ్య, సట్ల కుమారస్వామి, గుజ్జ కమలాకర్‌రావు, కొండే టి సత్యం, వడ్లకొండ ఎల్లగౌడ్, బందెల నాగార్జున్, బచ్చు గంగాధర్‌రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement