జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు | war between tdp leaders in jammalamadugu | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు

May 9 2016 10:42 AM | Updated on Aug 10 2018 8:16 PM

జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు - Sakshi

జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.

జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.

ఇటీవల పి.రామసుబ్బారెడ్డి గొరిగనూరు గ్రామంలో పర్యటించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇళ్లకు తాళాలు వేసుకుని నిరసన తెలిపారు. రామసుబ్బారెడ్డి పర్యటనపై ఎమ్మెల్యే ఆది కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన తన గ్రామాల్లో కల్పించుకుంటున్నారని ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. నేతల ఆధిపత్య పోరుతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement