ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్డు జడ్జీతో విచారణ చేపట్టాలి | want special enquiry on aob encounter | Sakshi
Sakshi News home page

ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్డు జడ్జీతో విచారణ చేపట్టాలి

Nov 14 2016 4:59 PM | Updated on Mar 28 2019 5:07 PM

ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్డీతో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాలఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

ఏలూరు(సెంట్రల్‌)ః 
ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై  సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్డీతో న్యాయ విచారణ చేపట్టాలని  డిమాండ్‌ చేస్తూ  ప్రజా సంఘాలఐక్య వేదిక  ఆధ్వర్యంలో  సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు వి.చిట్టిబాబు మాట్లాడుతూ ఖనిజ సంపదలను కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేసేందుకు ఆదివాసీలను  అడవి నుండి దూరం చేసేందుకు ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తుందని, పోలీసులు, పారామిలట్రీ దళాలు, గ్రీన్‌ హంట్‌ పేరుతో నరమోధం సృష్టిస్తూ అమాయక ఆదివాసీలు 10 మందిని ఎన్‌కౌంటర్‌లో దళ సభ్యులుగా చిత్రీకరించి దారుణంగా కాల్చి చంపారన్నారు. గత నెలలో  ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్డితో న్యాయవిచారణ చేపట్టాలని, ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై హత్య, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మృతి చెందిన గిరిజనులకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.  ఏవోబీలో పారామిలట్రీ దళాలు కూబింగ్‌ నిలిపివేయాలని చిట్టిబాబు డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌కు వినితిపత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.కనకరెడ్డి, దేపాటి శివప్రసాద్,ఎస్‌. రామకృష్ణ, ఎస్‌. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement