జిల్లాలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు | visilance officers visits | Sakshi
Sakshi News home page

జిల్లాలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Sep 13 2017 12:10 AM | Updated on Jun 1 2018 8:45 PM

జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

అనంతపురం సెంట్రల్‌: జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌యార్డు గోడౌన్‌ , మైనర్‌ ఇరిగేషన్‌ చెరువు, పలు ప్రభుత్వ భవనాలను, బ్రహ్మసముద్రం మండలంలో నిర్మాణంలో ఉన్న పలు కార్యాలయాలను తనిఖీ చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు తెలిపారు. తనిఖీల్లో కాంక్రీట్‌ కోర్‌ సామర్థ్యం నమూనాలు సేకరించామన్నారు. పరిశోధనశాల నుంచి వచ్చిన నివేదికల మేరకు లోటుపాట్ల గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారులు రవీంద్రకుమార్, విజయకుమార్, బాలరంగారెడ్డి, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement