రైస్‌ మిల్లుపై విజిలెన్సు దాడులు | vigilance attak rice mill | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లుపై విజిలెన్సు దాడులు

Aug 13 2016 9:24 PM | Updated on Sep 4 2017 9:08 AM

రైస్‌ మిల్లుపై విజిలెన్సు దాడులు

రైస్‌ మిల్లుపై విజిలెన్సు దాడులు

మండలంలోని కాపవరంలోని సూర్య మహాలక్ష్మి మోడ్రన్‌ రైస్‌ మిల్లుపై విజిలెన్సు అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూ. 24 లక్షల విలువ చేసే బియ్యం, ధాన్యం, రెండు ఆటోలు, రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. ఈ మిల్లుపై విజిలెన్సు దాడులు జరగడంతో కోరుకొండ మండలంలోని పలువురు తమ మిల్లులను, షాపులను మూసివేశారు.

  • రెండు ఆటోలు
  • రూ. 24 లక్షల విలువైన బియ్యం, ధాన్యం సీజ్‌
  •  
    కాపవరం (కోరుకొండ ) :
    మండలంలోని కాపవరంలోని సూర్య మహాలక్ష్మి మోడ్రన్‌ రైస్‌ మిల్లుపై విజిలెన్సు అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూ. 24 లక్షల విలువ చేసే బియ్యం, ధాన్యం, రెండు ఆటోలు, రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. ఈ మిల్లుపై విజిలెన్సు దాడులు జరగడంతో కోరుకొండ మండలంలోని పలువురు తమ మిల్లులను, షాపులను మూసివేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ పీఆర్‌ రాజేంద్రకుమార్, సీఐ ఎన్‌వీ భాస్కరరావు, విజిలెన్సు తహసీల్దార్‌ జి. గోపాలరావు, రాజమహేంద్రవరం ఏఎస్‌ఓ ప్రసాద్, ఎంఎస్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో రెండు ఆటోలతో పాటు 650 కేజీల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. మిల్లులో ఉన్న 33 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు. ఎటువంటి బిల్లులూ లేని 1640 క్వింటాళ్ల ధాన్యం, 31 క్వింటాళ్ల పీఎల్‌ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు .
     

Advertisement
 
Advertisement
Advertisement