రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వేంపల్లె విద్యార్థులు | vempalli students select in state wide kabaddi compitition | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వేంపల్లె విద్యార్థులు

Dec 16 2016 11:03 PM | Updated on Sep 4 2017 10:53 PM

వేంపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు దాసరి శ్రీనివాసులు, అరవిందులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం నారాయణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.


వేంపల్లె : వేంపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు దాసరి శ్రీనివాసులు, అరవిందులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం నారాయణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. కడప నగరంలో జరిగిన అండర్‌14 ఖేలో ఇండియా పోటీలలో పాల్గొని వీరు ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగే కబడ్డీ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement