ముగిసిన వరుణయాగం | varuna yagam end | Sakshi
Sakshi News home page

ముగిసిన వరుణయాగం

May 24 2017 11:24 PM | Updated on Sep 5 2017 11:54 AM

కరువు నుంచి విముక్తి కల్పించాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గంలోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న వరుణయాగం బుధవారం ముగిసింది.

రాయదుర్గం అర్బన్‌ : కరువు నుంచి విముక్తి కల్పించాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గంలోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న వరుణయాగం బుధవారం ముగిసింది. ఉదయం గంగపూజ అనంతరం, శ్రీమార్కండేయస్వామి ఆలయం వద్ద నుంచి 108 కలశాలతో జంబుకేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పూజా కార్యక్రమాల్లో మంత్రి కాలవ కుటుంబ సభ్యులతోపాటు మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారయణరెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యూత్‌నాయకులు పాటిల్‌ అజయ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రహాస్, ఆర్డీఓ రామారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement