కొనసాగుతున్న అత్యవసర వైద్యశిబిరం | Vaidyasibiram | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అత్యవసర వైద్యశిబిరం

Aug 14 2016 11:47 PM | Updated on Nov 6 2018 4:37 PM

మండలంలోని దుర్కిలో డయేరియా ప్రబలడంతో ఆరు రోజుల నుంచి గ్రామ చావిడిలో అత్యవసర వైద్యశిబిరం కొనసాగుతోంది.

దుర్కి(బీర్కూర్‌) : మండలంలోని దుర్కిలో డయేరియా ప్రబలడంతో ఆరు రోజుల నుంచి గ్రామ చావిడిలో అత్యవసర వైద్యశిబిరం కొనసాగుతోంది. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై శిబిరానికి వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నారు. గ్రామ వీఆర్వో అంజు, సర్పంచ్‌ మోహన్, కార్యదర్శి యాదగిరిలు అందుబాటులో ఉంటూ సమన్వయ పరుస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆదివారం వ్యాధి ప్రబలిన ఎస్సీకాలనీవాసులకు డీ ఫ్లోరైడ్‌ నీటిని ట్యాంకర్‌లో తెప్పించి సరఫరా చేశారు. బీర్కూర్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దిలీప్‌కుమార్, సూపర్‌వైజర్‌ కృష్ణవేణిలు, ఏఎన్‌ఎం ఉమ, ఆస్మాబేగం, ఆశ కార్యకర్తలు వైద్యచికిత్సలు అందించారు. పలువురిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement