వివాహిత ఆత్మహత్య | Unmarried woman sucide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 18 2016 12:26 AM | Updated on Sep 4 2017 1:53 PM

మండలంలోని రంగుండ్ల గ్రామంలో పెళ్లైన ఆరునెలలకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

æ హాలియా:  మండలంలోని రంగుండ్ల గ్రామంలో పెళ్లైన ఆరునెలలకే  యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆంగోతు అనిత(18) శనివారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామానికి చెందిన అనితకు రంగుండ్లకు చెందిన ఆంగోతు శంకర్‌తో  ఆరు నెలల క్రితమే వివాహమైంది. నెల క్రితమే ఇరువురి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ కూడా చేసినట్లు తెలిసింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement