రైలు ఢీకొని యువకుడి దుర్మరణం | unknown youngster killed in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

Jul 14 2015 9:34 PM | Updated on Sep 3 2017 5:29 AM

రైలు డీ కొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్: రైలు డీ కొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మదనాపురం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలిస్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 28 ఏళ్ల వయసు గల ఓ యువకుడిని రైలు డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 

మృతుడు పింక్ కలర్ షర్టు, బ్లూ కలర్ జీన్స్, కుడి భుజంపై జీకే అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement