రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | two youth dies in road accident in godhavarikhani | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Dec 12 2016 9:13 AM | Updated on Sep 2 2018 4:19 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన గోదావరిఖనిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

గోదావరిఖని(పెద్దపల్లి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తరుణ్(25), నాగార్జున(26) బైక్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు.

విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement