ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం | two women suicide | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం

Oct 8 2016 11:36 PM | Updated on Nov 6 2018 7:56 PM

మండలకేంద్రం యాడికిలో గీత(40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల కేంద్రం కోట వీధిలో నివాసముండే గీత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

యాడికి:  మండలకేంద్రం యాడికిలో గీత(40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల కేంద్రం కోట వీధిలో నివాసముండే గీత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించినట్లు బంధువులు తెలిపారు.
 
అలాగే  మండలంలోని కత్తిమానుపల్లిలో ఎల్లమ్మ(30) అనే మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ భార్య ఎల్లమ్మ కుటుంబ కలహాలతో విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన బంధువులు ఆమెను యాడికి ప్రభుత్వ వైద్యశాలకు,అక్కడి నుంచి తాడిపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement