జిల్లా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న ఇరువురు పోలీసు అధికారులను సస్పెన్షన్ చేస్తూ కడప, కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కడప అర్బన్ : జిల్లా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న ఇరువురు పోలీసు అధికారులను సస్పెన్షన్ చేస్తూ కడప, కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఓ విభాగంలో విధులు నిర్వర్తించే సమయంలో దొంగ డీజిల్ బిల్లు, వాహనాల రిపేర్లకు సంబంధించి అధిక మొత్తంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆర్‌ఎస్‌ఐ పోతురాజుతోపాటు ఎ.వేణుగోపాల్ (ఏఆర్ పీసీ 2373)ను సస్పెన్షన్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
రైల్వేకోడూరు ఎస్‌ఐ రమేష్‌బాబు సస్పెన్షన్
వరకట్న వేధింపు కేసులో సరిగా దర్యాప్తు చేయలేదని, సివిల్ పంచాయతీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైల్వేకోడూరు ఎస్‌ఐ డి.రమేష్‌బాబుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.